బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న శుభశ్రీ రాయగురు ఇటీవల ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన నటుడు, నిర్మాత అజయ్ మైసూర్ ని ప్రేమించి నిశ్చితార్థం చేసుకుంది. అజయ్ మైసూర్ ఆస్ట్రేలియాలో బాగా డబ్బున్న తెలుగువాళ్ళల్లో ఒకరు. లగ్జరీగా బతుకుతూ ఉంటారు. దీంతో అజయ్ ని శుభశ్రీ నిశ్చితార్థం చేసుకోవడంతో ఆమె డబ్బుల కోసమే చేసుకుంటుంది, నల్లగా ఉన్నవాడిని, లావు ఉన్నవాడిని ఎందుకు చేసుకుంటుంది, డబ్బుల కోసమే అంటూ పలువురు సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేసారు..
ట్రోల్ చేసినవాళ్లు వాళ్ళ పార్టనర్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటారో వాళ్లకు తెలుస్తుంది. ఈ ట్రోల్స్ చూసి ఏడ్చాను. పెళ్లి కూడా కాకుండానే డైవర్స్ గురించి మాట్లాడతారు. ఎందుకు అంత నెగిటివిటీ. మా ఫ్యామిలీకి లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు. మా డబ్బులు మా ఇష్టం, మా నిశ్చితార్థం, మా లవ్ ని సెలబ్రేట్ చేసుకున్నాం మీకెందుకు. మా ఫ్యామిలీస్ కూడా బాధపడ్డాయి. మాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి. మేము ఎలా ఉన్నామో మాకు తెలుసు, మీరు జడ్జ్ చేయక్కర్లేదు. ఇంత క్రూరంగా ఉండకండి అంటూ తమపై వచ్చిన ట్రోల్స్ పై స్పందిస్తూ ఎమోషనల్ అయింది..!!