నితిన్ హీరోగా తెరకెక్కిన ‘తమ్ముడు’ సినిమా జూలై 4న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాత దిల్ రాజు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈక్రమంలో తన భవిష్యత్ సినిమాలపై వివరాలు వెల్లడించారు. ఇందులో ఓ ఆసక్తికరమైన అప్డేట్ కూడా ఇచ్చారు. త్వరలో అల్లు అర్జున్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. సినిమా టైటిల్ ‘రావణం’గా ప్రకటించారు.
అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ తమ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమా ఉంటుందని ప్రకటించారు..నిజానికి ఈ సినిమాను ప్రభాస్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే..ప్రభాస్ వరుస కమిట్మెంట్స్ తో ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతుల్లోకి వెళ్లిందని తెలుస్తోంది..అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కు పునర్జన్మల కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. వీటి తర్వాత ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది..!!