ఉప్పుకప్పురంబు’ సినిమా జులై 4వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కీర్తి వరుస ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో కీర్తికి జోడిగా కలర్ ఫోటో సుహాసి నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె సినిమాల గురించి రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను సినిమా చేయాలి అంటే కథ బాగుంటే చాలు రెమ్యూనరేషన్ గురించి ఆలోచించనని రెమ్యూనరేషన్ అనేది నా చివరి ప్రాధాన్యత అంటూ తెలిపారు.
నా మొదటి ప్రాధాన్యత కథ మాత్రమేనని కీర్తి సురేష్ తెలిపారు.వైవిధ్యమైన పాత్రలు పోషించడమే నా లక్ష్యం. హీరోహీరోయిన్లకు సమాన రెమ్యూనరేషన్ విషయం పై చర్చలు జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే ఒక హీరో కోసం ప్రేక్షకులు ఎలా అయితే థియేటర్ కు వస్తున్నారో, అదే స్థాయిలో ఓ హీరోయిన్ కోసం కూడా ప్రేక్షకులు వస్తుంటే కచ్చితంగా నాయికకు హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వచ్చు కదా అంటూ కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..!!