సమంత మరోసారి ట్రోలర్స్ మీద విరుచుకుపడింది. తన పర్సనాలిటీ మీద రీసెంట్ గా వస్తున్న నెగెటివ్ కామెంట్స్, పోస్టులు, ట్రోల్స్ మీద సీరియస్ గా స్పందించింది. ఈ మేరకు ఇన్ స్టా స్టోరీస్ లో ఓ వీడియోను షేర్ చేస్తూ సవాల్ విసిరింది. ఈ వీడియోలో ఆమె పుల్ అప్స్ చేస్తూ కనిపిస్తోంది. ఆ వీడియో మీద ఇలా రాసుకొచ్చింది. మనం ఒక డీల్ కుదుర్చుకుందాం. మీలో ఎవరైనా ఇలా 3 పుల్ అప్స్ చేయండి. మీకు దమ్ముంటే ఈ పనిచేసి చూపించండి..
అలా చేసే వరకు మీరు నా మీద నెగెటివ్ కామెంట్స్ చేయడం ఆపేయండి. ఒకవేళ మీరు చేయలేకపోతే సన్నగా ఉన్నావ్, నీరసంగా ఉన్నావ్ అంటూ చెత్త కామెంట్స్ ఇంకెప్పుడూ చేయకండి అంటూ కౌంటర్ విసిరింది. ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రీసెంట్ గా ముంబైలోని ఓ జిమ్ నుంచి సమంత బయటకు వస్తూ ఫొటోగ్రాఫర్లపై సీరియస్ అయింది. అందులో ఆమె లుక్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి. సమంత ఇంత సన్నబడిపోయిందేంటి.. ఆమెకు ఏమైనా వ్యాధి వచ్చిందా అంటూ ప్రచారం కూడా జరిగింది..!!