in

beauty Sreeleela out from akhil’s Lenin?

శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు , ఒక తమిళ సినిమా ఉంది. అలానే తెలుగులో అఖిల్ సరసన లెనిన్ అనే మూవీ కూడా చేస్తోంది. ఈ ఏప్రిల్‌లో అఖిల్, శ్రీలీల జంటగా కనిపించనున్నారని ఒక వీడియో రిలీజ్ చేసి అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. ఈ ఏడాది దీపావళికి ఈ మూవీ రిలీజ్ అనుకుంటున్నారు. అయితే ఎక్కువగా హిందీ, తమిళ సినిమాలకే డేట్స్ ఇస్తున్న కారణంగా శ్రీలీలకు బదులు మరో హీరోయిన్‌ ని చూసుకోవాలని టీమ్ భావిస్తుందట..

అందుకే ఈ సినిమాలో నుంచి హీరోయిన్ శ్రీలను మూవీ మేకర్స్ తీసేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే హీరోయిన్ శ్రీ లీల విషయానికొస్తే చివరగా రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు త్వరలో మాస్ జాతర సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది..!!

rajamouli ‘Eega’ makers send legal notice to Malayalam film ‘Lovely’ for copyright!

chiranjeevi – nagarjuna multi starrer combo missed!