in

AP High Court slams Kannappa for release Without Censor Clearance!

సెన్సార్ స‌ర్టిఫికెట్‌ రాకముందే గుంటూరులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అంతేకాదు..ఈ ఈవెంట్‌లో ఎన్ని అవరాధాలు వచ్చినా జూన్ 27న కన్నప్ప కచ్చితంగా రిలీజ్ చేస్తామని..అనౌన్స్‌ చేశారు. ఇక ఈ ప్రకటనను పత్రికల్లో వచ్చిన వార్తలను..సెంట్రల్ ఫిలిం సర్టిఫికేషన్ బోర్డ్‌ తరఫున హాజరైన అడ్వకేట్..కోర్టుకు ఆధారాలతో చూపించాడు. ఈ క్రమంలోనే హైకోర్టు కన్నప్ప టీంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా సెన్సార్ స్క్రుటీని జరగక ముందే..రిలీజ్ డేట్ ను ఎలా ప్రకటించారని కోర్ట్ ఆగ్ర‌హాం వ్యక్తం చేసింది. ప్రతివాదులైన సెన్సార్ బోర్డు..ఇతరుల వైఖరి పై కోర్టు మండిపడింది.

మీరు కౌంటర్ ఇవ్వకపోతే..నోటీసులు అందిన తర్వాత కూడా టీం హాజరు కాకపోతే.. అనుమతులు లేకుండా సినిమాను రిలీజ్ చేస్తే మాత్రం కోర్టు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని వార్నింగ్ ఇచ్చింది. అలాగే నెక్స్ట్ విచారణ సరిగ్గా జూన్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఇదే రోజున కన్నప్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మూవీ టీం అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో..ప్రస్తుతం సర్వత్ర ఆసక్తి నెలకొంది. సినిమా వివాదం ఇప్పటికీ హైకోర్టు ఆగ్రహంతో పాటు..మూవీ రిలీజ్ ముందస్తు ప్రకటనలు అన్ని సినిమాను అంతకంతకు వివాదంలోకి నెట్టేసాయి. ఈ క్రమంలోనే జూన్ 27న సినిమా రిలీజ్‌పై హైకోర్టు తుది నిర్ణయం ఆధారపడి ఉంది..!!

Yash Changes ‘Toxic’ Shooting Location For Mom-To-Be Kiara Advani?

rakul preet singh to play surpanaka in ramanyan!