in

Anupama Parameswaran: thanks for the hate and criticism

తెలుగులో ‘ప్రేమమ్’, ‘అ ఆ’, ‘శతమానం భవతి’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైనప్పటికీ, కెరీర్‌ తొలినాళ్లలో తనకు నటన రాదంటూ పలువురు తీవ్రంగా ట్రోల్ చేశారని అనుపమ గుర్తుచేసుకున్నారు. ఆ మాటలు మొదట్లో బాధపెట్టినా, అవే తనలో పట్టుదల పెంచాయని, నటిగా తనను తాను నిరూపించుకోవాలనే కసిని రగిలించాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో కెరీర్‌పరంగా, వ్యక్తిగతంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు..

అయితే, ఈ విమర్శలే తనను తాను మెరుగుపరుచుకోవడానికి, మంచి కథలను ఎంచుకోవడంలో మరింత జాగ్రత్త వహించడానికి దోహదపడ్డాయని అనుపమ వివరించారు. విమర్శల ఫలితంగా తన ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చిందని, ప్రేక్షకులను మెప్పించే బలమైన కథలను మాత్రమే ఎంచుకోవాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రవీణ్‌ నారాయణన్‌ తనపై నమ్మకముంచి ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ’ JVSK వంటి అద్భుతమైన చిత్రంలో అవకాశం కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు..!!

keerthy suresh ‘Uppu Kappurambu’ Gets OTT Release Date!

Ram Charan’s ‘Peddi’ bags whopping Rs 105 cr OTT deal