ఈసినిమా స్టోరీ ఉన్న హార్డ్ డ్రైవ్ ని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. కన్నప్ప సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డు డ్రైవ్ ను ఫిలింనగర్ లోని 24 ఫ్రేమ్స్ సంస్థకు ముంబై హెచ్ఐవీఈ స్టూడియోస్ టీడీడీసీ కొరియర్ ద్వారా పంపించారు.
ఈ పార్సెల్ ని ఈనెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని దానిని చరిత అనే మహిళకు అందించాడు అప్పటినుండి వారిద్దరూ కనిపించడం లేదట. అయితే ఇది కొంతమంది పెద్దవాళ్లు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని విజయ్ కుమార్ కోరారు.. దీంతో కేసు ఫైల్ చేసుకున్న పోలీసులు రఘు , చరితని అరెస్టు చేశారు. ఇక దీని వెనుక ఎవరి హస్తం ఉంది అనే విషయంపై ఆరా తీస్తున్నారు..!!