in

dancing queen sreeleela gets another special song offer!

క్కప్పుడు ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా హాట్ మోడల్స్‌ను తీసుకురావడం సాధారణం. విదేశాల నుంచి తెల్ల చర్మం ఉన్న మోడల్స్‌ను ఎంపిక చేసేవారు, ఎందుకంటే అప్పటి హీరోయిన్లు ఇలాంటి గ్లామరస్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు. రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండటం, క్రేజ్ పెరగడం వంటివి ఈ మార్పుకు కారణాలు. ఈ జాబితాలోకి తాజాగా శ్రీలీల కూడా చేరిపోయిందని వార్తలు వస్తున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’లో ఓ మాస్ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను తీసుకున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ.  ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. ఈ మాస్ సాంగ్‌లో చరణ్‌తో కలిసి శ్రీలీల స్టెప్పులేసే అవకాశం ఉందని టాక్. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది..!!

Deepika Padukone on board for prabhas’ spirit?