స్టార్ హీరోల సరసన సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా మీనాక్షి చౌదరి ఒక క్రికెటర్ మోజులో ఉందని తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో మీకు ఏ ఐపిఎల్ టీమ్ అంటే ఇష్టమని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు మీనాక్షి చౌదరి సమాధానం చెబుతూ తనకు ఫలానా టీం అంటూ ఇష్టమేమీ లేదని అయితే ఏ టీంలో అయితే ధోని ఆడుతూ ఉంటారో ఆ టీం నాకు చాలా ఇష్టం అని తెలిపారు.
క్రికెటర్ ఎంఎస్ ధోని అంటే చాలా ఇష్టం కావడంతో ఆయన ఏ జట్టులో మ్యాచ్ ఆడితే ఆ టీంను తాను సపోర్ట్ చేస్తానంటూ ధోని పై తనకున్నటువంటి ఇష్టాన్ని బయటపెట్టారు. ఇలా క్రికెటర్ ఎంఎస్ ధోని అంటే పిచ్చ ఇష్టం అంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో ఎంఎస్ ధోని ఫ్యాన్స్ కూడా మీనాక్షి చౌదరికి అభిమానులుగా మారిపోయారు. ఇలా ధోని గురించి మీనాక్షి చౌదరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..!!