మన జీవితంలో మనకు కఠిరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలనే విషయాలను నిత్యం నేర్చుకుంటున్నానని సమంత తెలిపారు. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే నాకు పుష్ప సినిమాలో ఊ అంటావా మావ సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది. అప్పటివరకు నేను అలాంటి సాంగ్స్ అసలు చేయలేదు ఈ సాంగ్ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడ్డానని, ఈ పాటను ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సందేహం కూడా నాలో ఉండేదని తెలిపారు.
నేను హాట్ గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆ పాటను ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారని సమంత తెలిపారు. అయితే ఇక పై అలాంటి సాంగ్స్ అస్సలు చేయనని ఈమె తెలిపారు.ప్రస్తుతానికి వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాలను చేయాలని చూస్తున్నాను. త్వరలోనే మా ఇంటి బంగారం మూవీ సెట్స్ లో పాల్గొంటా అంటూ సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!