రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న స్టార్ ఇమేజ్‌ను నిలబెట్టుకోవడానికి కీలక దశలో నిలిచింది. ‘పుష్ప’, ‘అనిమల్’, ‘ఛావా’ లాంటి భారీ విజయాల తర్వాత ఆమెకు ‘సికందర్’ రూపంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సల్మాన్ ఖాన్‌తో చేసిన ఈ సినిమా కంటెంట్ పరంగా నిరాశపరిచింది. ఇందులో రష్మిక పాత్రకు ప్రత్యేకత లేకపోవడం, ట్రాక్ ఎక్కువగా రొటీన్‌గా ఉండటం విమర్శలకు దారితీసింది. ఫలితంగా, రష్మికపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది.
ఇక ఆ పరాజయం వదిలేసి తిరిగి ట్రాక్‌లోకి రావాలంటే, దీపావళికి రిలీజ్ కానున్న ‘థామ’ సినిమా ఆమెకు ఛాన్స్‌గా మారింది. మాడాక్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రంలో రష్మిక ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్నారు. ఊటీలో షూటింగ్ జరుగుతోంది. గతంలో ‘స్త్రీ’, ‘బెడియా’, ‘ముంజ్యా’ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న మాడాక్ సంస్థ, ఇప్పుడు ‘థామ’పై కూడా అదే స్థాయిలో అంచనాలను పెంచుతోంది..!!