అల వైకుంఠపురములో’ తర్వాత వచ్చిన ప్రతీ సినిమా ఆమెను వెనక్కి నెట్టేసింది. ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’, చిరంజీవితో ‘ఆచార్య’, విజయ్‌తో ‘బీస్ట్’, బాలీవుడ్లో ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్..’చిత్రాలు వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి. ఇప్పుడు తమిళంలో ‘రెట్రో’తో మళ్లీ ఫామ్ లోకి రావాలనుకుంది. కానీ అక్కడ కూడా పరిస్థితి అనుకూలంగా లేదు. మొదట రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినా కథన తీరుపై విమర్శలు రావడంతో మౌత్ టాక్ మిశ్రమంగా మారిపోయింది..
తెలుగు ప్రేక్షకులు అయితే మొదటి రోజే నిరాశ వ్యక్తం చేశారు..ఆరు వరుస ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చిన ‘రెట్రో’పై ఎంతగానో ఆశ పెట్టుకున్న పూజాకు ఇది ఏడో ఫ్లాప్ గా మిగిలే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే ట్రాక్ కొనసాగితే ఆమెకు భవిష్యత్తులో పెద్ద ప్రాజెక్టులు దొరకడం కష్టమే. దర్శక నిర్మాతలు ఇప్పటికే కొత్త తరం నటీమణుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో పూజా మళ్లీ తెలుగు ఇండస్ట్రీపై ఆశలు పెట్టుకుంటున్నట్టు సమాచారం..!!