గురువారం ‘హిట్3’ విడుదల కావడంతో ఆ ప్రచారంపై క్లారిటీ వచ్చేసింది. కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ మూవీ క్లైమాక్స్‌లో కార్తి మెరిశారు. రత్నవేలు పాండియన్ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించారు. “దేశమంటే మట్టికాదోయ్..దేశమంటే మనుషులోయ్” అంటూ ప్రముఖ కవి శ్రీ గురజాడ అప్పారావ్ చెప్పిన కవిత్వాన్ని తనదైన స్టైల్‌లో చెబుతూ కార్తి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్న నెటిజన్లు..
కార్తి ఎంట్రీ అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే ‘హిట్’ యూనివర్స్‌లో నాలుగో సినిమా హీరో కార్తినే అంటూ కన్ఫార్మ్ చేసేస్తున్నారు. ఇంతకుముందు ‘హిట్’ సిరీస్‌లోని రెండు సినిమాల్లో కూడా క్లైమాక్స్‌లో కనిపించిన హీరోలనే శైలేశ్ కొలను తర్వాతి సినిమాకు హీరోగా ఎంచుకున్నారు. దీంతో నాలుగో సినిమా కార్తినే అనే అంటున్నారు..!!