ప్రముఖ తమిళ నటుడు సూర్య తన తదుపరి చిత్రాన్ని తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన తన తదుపరి చిత్రం ‘రెట్రో’ ప్రీ-రిలీజ్ వేడుకలో సూర్య ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. దుల్కర్ సల్మాన్‌తో వెంకీ అట్లూరి ఇటీవల తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే..
ఫైనాన్షియల్ క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా విజయవంతమైంది..ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ..”ఈ రోజు నేనొక విషయం చెప్పాలి. ఈ ప్రయాణం అల్లు అరవింద్‌తో మొదలైంది. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ, నా సోదరుడు వెంకీతో కలుస్తున్నాం. ఇదే నా తదుపరి చిత్రం. అందరూ అడుగుతున్నట్లుగా, చాలా కాలం తర్వాత మంచి ప్రతిభావంతులతో కలిసి నా తదుపరి తమిళ చిత్రాన్ని ప్రియమైన వెంకీతో చేస్తున్నాను..!!