జీవితంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు శ్రుతి స్పందిస్తూ, “కొంతమంది చాలా విలువైన వ్యక్తులను నేను బాధపెట్టాను. అలా చేసి ఉండాల్సింది కాదు అనిపిస్తుంది. దాని గురించి ఇప్పుడు కూడా బాధపడుతూ, క్షమాపణలు కోరుతుంటాను. మిగతా విషయాల్లో నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు” అని అన్నారు. తాను కొన్నిసార్లు సరదాగా, అనాలోచితంగా ప్రవర్తించినా, ఇతరులను బాధపెట్టడం మాత్రం తనకు బాధ కలిగిస్తుందని ఆమె తెలిపారు..
తన ప్రేమకథలు, బ్రేకప్‌ల గురించి మాట్లాడుతూ, “మన అందరి జీవితంలో ఒక ప్రమాదకరమైన మాజీ ఉంటారు. అది తప్ప, మిగతా బంధాలను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండానే ముగించాను. ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్ అని కొందరు అడుగుతుంటారు. వారికి అది కేవలం ఒక నంబర్. కానీ నాకు, నేను కోరుకున్న ప్రేమను పొందడంలో విఫలమయ్యాను అనేదానికి గుర్తు. అందుకే నేను దాని గురించి సిగ్గుపడను, కానీ మనిషిగా కొంచెం బాధ ఉంటుంది” అని శ్రుతి వివరించారు..!!