96 విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఎలాంటి ఘనవిజయం అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ మద్యన లిప్ లాక్ సీన్ ఉంటుందట. ఈ సీన్ డైరెక్టర్ ముందుగానే వివరించాడట. త్రిష దీనికి ఒప్పుకున్న..విజయ్ సేతుపతి మాత్రం అస్సలు అంగీకరించలేదు. అయినా క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది..
ఇద్దరు ఒకరికొకరు వీడ్కోలు పలికే టైం లో ఈ సన్నివేశం ఉండాలని..దర్శకుడు చెప్పిన నిరాకరించాడట. అయితే లిప్ లాక్ సీన్ లేకపోయినా విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పుకోవాల్సిన ఈ క్లైమాక్స్ సీన్..ఆడియన్స్ లో గుర్తుండిపోయింది. ఇక సినిమాలో త్రిష జాను పాత్రలో మెరిసింది. కాగా.. ఇండస్ట్రీలో విజయ్‌సేతుపతితో పాటే.. లిప్ లాక్ సీన్స్ రిజెక్ట్ చేసే హీరోల లిస్టులో అజిత్, సూర్య, శివ కార్తికేయన్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి..!!