తాజాగా అమ్మాయిల పీరియడ్స్ బాధపై స్పందించింది. ‘చాలా మంది పీరియడ్స్ బాధను చాలా లైట్ గా మాట్లాడుతారు. కానీ ఆ టైమ్ లో వచ్చే పెయిన్, మూడ్ సింగ్స్ చాలా బాధాకరం. నాకు పీరియడ్స్ టైమ్ లో మూడ్ సింగ్స్ ఘోరంగా మారుతాయి. అప్పుడు నా చిరాకు చూసి నీకు ఇది ఆ టైమా అని కొందరు అర్థం చేసుకుంటారు’ అంటూ చెప్పింది. ‘పీరియడ్స్ బాధను అమ్మాయిలే తట్టుకుంటారు.
ఒకవేళ అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే అస్సలు ఆ బాధ తట్టుకోలేరు..అప్పుడు మా బాధ వాళ్లకు అర్థం అయ్యేది. వాళ్లకు పీరియడ్స్ వస్తే ఈ పాటికి అణు యుద్ధాలే జరిగేవి. చాలా మంది ఇప్పటికీ పీరియడ్స్ ను ఏదో పెద్ద తప్పు అన్నట్టే మాట్లాడుతారు. అలాంటి వాళ్ల గురించి మనం పట్టించుకోవద్దు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న భారీ సినిమాలో కూడా జాన్వీకపూర్ నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది..!!