కన్నడ భామ పూజా హెగ్డేకు తెలుగులో అవకాశాలు రాకపోయినా బాలీవుడ్ లో ఛాన్స్ లు వస్తున్నాయి. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న ఈ బుట్టబొమ్మ..ఆ తర్వాత అంతే వేగంగా పడిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో తనను ఫాలో అయ్యే వారి గురించి పూజా హెగ్డే ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది..
ఇన్స్టాగ్రామ్ లో తనకు 27 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారని..అయితే, వారంతా తన సినిమాలు చూసేందుకు థియేటర్లకు రారని పూజా హెగ్డే వ్యాఖ్యానించింది. చాలా మంది సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోయర్లు ఉంటారని..కానీ, వారి సినిమాలకు కోట్ల మంది వస్తుంటారని తెలిపింది. కాబట్టి ఫాలోయర్లు ఉన్నంత మాత్రాన వాళ్లంతా మన కోసం థియేటర్లకు వస్తారని కాదని చెప్పింది..!!