ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటివలే కుమారుడితో సహా పవన్ కల్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు. కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో తల్లి అన్నా లెజినోవా తిరుమలలో మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే..
ఈక్రమంలో హైదరాబాద్ చేరుకున్న పవన్ కల్యాణ్ ను సోమవారం అల్లు అర్జున్ కలిశారు. మార్క్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటసేపు పవన్ కుటుంబసభ్యులను కలుసి మాట్లాడినట్టు తెలుస్తోంది. బాలుడు త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. దేశ ప్రధాని మోదీ, ఏపీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తో సహా నటుడు ఎన్టీఆర్ తదితరులు, పవన్ అభిమానులు మార్క్ కోలుకోవాలని ఆకాంక్షించారు..!!