in

milky beauty Tamannaah Charges Big For ‘Nasha’ Song!

మిల్కీ బ్యూటీ తమన్నా సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తోంది. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన తమన్నాకు  ఐటెం సాంగ్స్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తమ సినిమాలో తమన్నా సాంగ్ ఉంటే హిట్ అయినట్టేనని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్, వాణి కపూర్ జంటగా తెరకెక్కిన ‘రైడ్ 2’ చిత్రంలో తమన్నా మరోసారి మెరిసింది. ‘నషా’ అనే స్పెషల్ సాంగ్ తో అలరించింది.

నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సాంగ్ 24 గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ పాట కోసం తమన్నా ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనేది బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 5 నిమిషాల ఈ పాట కోసం ఏకంగా రూ. 1 కోటి తీసుకుందని సమాచారం. కేవలం 5 నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ కోసం తమన్నా ఈ రేంజ్ లో తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది..!!

17 years for ‘dhee’!

Anchor Ravi apologizes for hurting Hindu sentiments!