
ఎన్టీఆర్, నీల్ సినిమాపై బిగ్ అప్డేట్, ‘డ్రాగన్’ సెట్స్ లో ఎంట్రీ!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 22 నుంచి తారక్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ క్రేజీ అప్డేట్తో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు..కాగా, ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు..!!

