ఓఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను పదో తరగతి చదువుతున్నప్పుడే చిత్ర పరిశ్రమలోకి వచ్చానని, నటనను కేవలం వృత్తిగా కాకుండా ఇష్టంగా, ఆనందంగా చేశానని ఆమె అన్నారు. నిజ జీవితంలో తాను కళాశాల విద్యను అభ్యసించలేకపోయినప్పటికీ, సినిమాల్లో మాత్రం విద్యార్థినిగా నటించానని ఆమె తెలిపారు. పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు..
కెరీర్ ప్రారంభించినప్పుడు ఇన్నేళ్లు కొనసాగుతానని అనుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా తన 21వ పుట్టినరోజున జరిగిన ఒక సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు..ఆ రోజు షూటింగ్ నుండి విరామం తీసుకుని ఇంటిలో ఉండగా, ఒక తమిళ పత్రికలో తనను నంబర్ 1 నటిగా పేర్కొంటూ ఒక ప్రత్యేక కథనం వచ్చిందని, అది చదివి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె అన్నారు..!!