లేటెస్ట్గా జీ తమిళ్‌లో ప్రసారం అయ్యే డ్యాన్స్ షోకి జడ్జ్గా వ్యవహరించింది. ఆ షోలో వరలక్ష్మి శరత్‌కుమార్.. తాను చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురైనట్లు బాధపడుతూ చెప్పింది. ఆమె తన బాల్యంలో జరిగిన కథను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. కెమీ అనే డ్యాన్స్ కంటెస్ట్ తన కుటుంబ సభ్యులచే నిరాశకు గురైనట్లు చెబుతూ ఎమోషనల్ అయింది. అలా ఇతరులచే లైంగిక వేధింపులకు గురైనట్లు తన కథను ఈ షో ద్వారా తెలిపారు.నేను మీలాగే లైంగిక వేధింపులకు గురయ్యాను..
నా తల్లిదండ్రులు అప్పట్లో తమ సినిమా పనుల్లో బిజీగా ఉండేవారు. కాబట్టి వారు నన్ను ఇతరుల సంరక్షణలో వదిలివేసేవారు. అయితే చిన్నప్పుడు నేను ఐదారు మంది నుంచి ఇలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను. ఇప్పుడు మీ పరిస్థితి చిన్నప్పుడు నా పరిస్థితి కూడా ఒకటేనని వరలక్ష్మి తెలియజేశారు నాకు పిల్లలు లేరు కానీ నేను తల్లిదండ్రులకు చెప్పే విషయం ఒకటే..తమ పిల్లలకు ‘మంచి స్పర్శ’ మరియు ‘చెడు స్పర్శ’ గురించి నేర్పించాలని అభ్యర్థిస్తున్నానని వరలక్ష్మి కోరింది..!!