SSMB29 సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో భారీ నిర్మాణ వ్యయంతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్టుపై మహేశ్ కుమార్తె సితార స్పందించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది. హైదరాబాద్ లో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు సితార, నమ్రతా శిరోద్కర్.
కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశంలో సితారకు మహేశ్-రాజమౌళి సినిమాపై ప్రశ్న ఎదురైంది. సినిమాపై స్పందించాలనే ప్రశ్నకు..‘ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే బెటర్’ అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. దీనికి నమ్రత సైతం చిరునవ్వులు చిందించారు. సినిమా ఇటివలే ఒడిశాలో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మహేశ్-పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళికి సంబంధించి ఫొటోలు వైరల్ అయ్యాయి. సినిమాలో ముఖ్యపాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు..!!