దేశ వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆలయాల్లో సంప్రదాయ వస్త్రధారణ ఆవశ్యకతపై సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫ్యాషన్ పై ఎంతో దృష్టి పెట్టే రకుల్..ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఉన్నప్పుడు సరైన వస్త్రాలను ధరించాలని చెప్పింది. ల్యాక్మే ఫ్యాషన్ వీక్ లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ ఫిగర్ గా మనం ఏది చేసినా బాధ్యతాయుతంగా చేయాలనేది తన అభిప్రాయమని రకుల్ తెలిపింది..
ఫ్యాషన్ విషయానికి వస్తే సందర్భాన్ని బట్టి మన డ్రెస్సింగ్ ఉండాలని చెప్పింది. దేవాలయానికి వెళితే దానికి తగ్గట్టుగా సాంప్రదాయ వస్త్రధారణ ఉండాలని తెలిపింది. జిమ్ కు వెళ్లినప్పుడు వర్కౌట్లకు వీలుగా డ్రెస్సింగ్ వేసుకోవాలని, డిన్నర్ కు వెళ్లినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా డ్రెస్ వేసుకోవాలని సూచించింది. సందర్భానికి అనుగుణంగా పరిధికి లోబడి వస్త్రధారణ ఉండాలని చెప్పింది. ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయంలో వస్త్రధారణకు సంబంధించి ఈ జనవరిలో డ్రెస్ కోడ్ ను అమల్లోకి తెచ్చారు. పొట్టి దుస్తులు, మన శరీరాకృతి కనిపింటే వస్త్రాలను నిషేధించారు..!!