నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత ఒంటరిగానే ఉంటున్నారు అయితే ఈమె గత కొంతకాలంగా డైరెక్టర్ రాజ్ నిడుమోరితో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం జరుగుతుంది. నెల వ్యవధిలోనే ఏకంగా మూడు పార్టీలకు వీరిద్దరూ చాలా చనువుగా జంటగా హాజరు కావడంతో సమంత రాజ్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని ఏ క్షణమైనా ఈమె తన ప్రేమ విషయాన్ని బయట పెట్టవచ్చు అంటూ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే డైరెక్టర్ రాజ్ కు వివాహమైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఫోటోలలో భాగంగా ఈమె చేతికి ఒక డైమండ్ రింగ్ కనిపించింది. ఇలా సమంత చేతి వేలికి రింగ్ కనిపించడంతో సమంత రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారా డైరెక్టర్ రాజ్ తోనే ఈమె నిశ్చితార్థం చేసుకున్నారా అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సమంత గురించి వస్తున్న ఈ వార్తలలో నిజం ఎంతవరకు ఉంది అనేది తెలియాలి అంటే సమంత రియాక్ట్ అవ్వాల్సిందే..!!