నిర్మాత నాగ వంశీ స్వయంగా ఇంటర్వ్యూలో దీనిపై హింట్ ఇస్తూ ఆసక్తిని పెంచేసాడు. రామాయణ, మహాభారత గాథల్లో ఎంతోమంది వీరుల కథలు ఉన్నాయి. కానీ..ఎంతో శక్తివంతమైన ఓ గొప్ప దేవుడి కథ ఇప్పటివరకు లోతుగా ఎవ్వరూ చూపించలేదు. ఈ సినిమాలో అలాంటి అద్భుతమైన వీరుడి కథనే మనం చూపించబోతున్నామంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ తో ఈ సినిమా పురాణ గాథ ఆధారంగా ఎవరికి ఎక్కువ తెలియని దేవుడి కాన్సెప్ట్ తెరకెక్కుతుందని క్లారిటీ వచ్చేసింది.
ఇక సన్నిహత వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రాచీన వీరుడైన కార్తికేయ స్వామిని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించనున్నాడట. ఇప్పటివరకు కార్తికేయుడు పై భారతీయ సినిమాల్లో పెద్దగా కథలేమి చూపించలేదు. తమిళ్ సినీ ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగా పరిచయం ఉన్నా.. తెలుగు సినిమాల్లో ఈ కోణం ఇప్పటివరకు చూపలేదు. ఈ క్రమంలోనే ఇది వాస్తవం అయితే అల్లు అర్జున్ గతంలో ఎప్పుడు చూడని విధంగా సరికొత్త రోల్ లో చూడోచనడంలో అతిశయొక్కలేదు..!!