in

Chiranjeevi to play Shankar Vara Prasad in Anil Ravipudi’s film!

నిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా సినిమా ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఈ సినిమాలో చిరంజీవి “శంకర్ వరప్రసాద్” అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని రివీల్ చేశారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవల విక్టరీ వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, వచ్చే ఏడాది సంక్రాంతికి మెగాస్టార్‌తో మరో మాస్ ఎంటర్‌టైనర్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. మే చివరలో లేదా జూన్‌లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు దర్శకుడు తెలిపారు.

ఇటీవలి ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ, ఈ చిత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని స్పష్టంచేశారు. “గ్యాంగ్ లీడర్,” “ఘరానా మొగుడు,” “రౌడీ అల్లుడు” చిత్రాల్లో కనిపించిన చిరంజీవి ఎనర్జీని మరోసారి తెరపై చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా, త్వరలోనే పూజా కార్యక్రమాలతో మూవీ అధికారికంగా లాంచ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు ఈ సినిమా మరింత మాస్ ఫీస్ట్ ఇవ్వబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు!

HAPPY BIRTHDAY RAM CHARAN!

Allu Arjun and Trivikram Srinivas’ mythology film confirmed!