in

Pooja Hegde opens up about gender discrimination

సినీ పరిశ్రమలో హీరోల డామినేషన్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. కథ, హీరోయిన్ ఎవరుండాలి ఇలా అన్నీ కూడా హీరోలు చెప్పినట్టుగానే జరిగిపోతుంటాయి. ఇదే సమయంలో హీరోయిన్లపై వివక్ష ఉంటుందనే విషయం కూడా విదితమే. ఇదే అంశంపై ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్లు విమర్శలు గుప్పించారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఇదే అంశంపై స్పందించింది. హీరోయిన్లు వివక్షకు గురవుతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

షూటింగ్ స్పాట్ లో హీరోల కారావాన్లు సెట్ కు దగ్గరగా ఉంటాయని..హీరోయిన్లవి మాత్రం ఎక్కడో దూరంగా ఉంటాయని పూజ చెప్పింది. తాము పొడవైన, బరువైన కాస్ట్యూమ్స్ ధరించి నడుచుకుంటూ రావాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్లు పలు రకాలుగా వివక్షకు గురవుతుంటారని చెప్పింది. కొన్నిసార్లు పోస్టర్లలో హీరోయిన్ల పేరు కూడా ఉండదని తెలిపింది. ఇన్నేళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ..తనను తాను సెకండ్ గ్రేడ్ వ్యక్తిగానే భావిస్తానని చెప్పింది..!!

Salman Khan On Romancing 31-Year Younger Rashmika!

Shalini Pandey Opens Up About Disturbing Experience with Director