తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలోని పాట షూట్ చేసే సమయంలో రష్మికను చూసి నేను కాస్త ఇబ్బంది పడ్డాను ఆమెతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. నిజానికి రాబిన్ హుడ్ సినిమాలో మొదట రష్మిక ఫైనల్ అయ్యారు ఈమెకు సంబంధించి కొన్ని సన్నివేశాలను షూట్ కూడా చేశారు..
కానీ రష్మిక తప్పుకోవడంతో ఆస్థానంలోకి శ్రీ లీల ఎంట్రీ ఇచ్చారు దీంతో రష్మికను చూడగానే తనకు మాట్లాడటానికి కాస్త ఇబ్బంది కలిగిందని తెలియజేశారు అయితే స్వయంగా రష్మిక ఈ సినిమా గురించి మాట్లాడుతూ నాకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల సినిమా నుంచి తప్పుకున్నానని తెలపడంతో నాకు కాస్త రిలీఫ్ అయింది. ఇలా రష్మిక చెప్పిన తర్వాత తనతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యానని మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాము అంటూ తెలియచేశారు..!!