సమంత తన నటనకి తాత్కాలిక విరామం తీసుకున్నా, తన సినీ కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆమె కేవలం నటిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా మారి సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం అవుతోంది. గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత, ఇప్పుడు తాను ఓ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తూ కొత్త ప్రయోగాన్ని చేస్తోంది. ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె కొత్త సినిమాలను సైన్ చేయలేదు..
కానీ, ఈ విరామాన్ని సృజనాత్మకంగా ఉపయోగించుకుని, నిర్మాతగా తన తొలి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. సమంత స్వంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘శుభం’. ఈ సినిమా ద్వారా సమంత పూర్తి స్థాయి నిర్మాతగా మారనుంది. వసంత్ మరిగంటి అందించిన కథకు ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. వినోదంతో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్న ఈ సినిమా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం చెబుతోంది..!!