నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ ఎర్నేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ పాత్రలో నటించారనే వార్త వైరల్ అవుతోంది. అయితే తాజాగా నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని తెలియజేశారు. కింగ్ స్టన్ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న రవిశంకర్..
రాబిన్ హుడ్ సినిమా గురించి స్పందిస్తూ..ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిట్ వార్నర్ ఈ సినిమాలో అతిధి పాత్ర పోషించాడని అన్నారు. తన అనుమతి లేకుండా ఈ సమాచారాన్ని తెలియజేసినందుకు నిర్మాత వెంటనే దర్శకుడు వెంకీ కుడుములకు క్షమాపణలు చెప్పారు. రాబిన్ హుడ్‌తో డేవిడ్ వార్నర్‌ను భారతీయ సినిమాలోకి పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు రవిశంకర్. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు, సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..!!