in

Shruti Haasan talks about the story of her life ‘the eye’!

శృతి ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి మెప్పించింది. ఇప్పడు హాలీవుడ్ లో కూడా కొత్త జర్నీ మొదలు పెట్టింది. శృతి హాసన్ హాలీవుడ్ లో ‘ది ఐ’ అనే మూవీతో ఎంట్రీ ఇస్తోంది. శృతి మల్టీ టాలెంటెడ్. కేవలం నటనే కాదు, మ్యుజిషియన్, సింగర్ కూడా.  త‌న హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ది ఐ’ గురించి శ్రుతి హాసన్ మాట్లాడుతూ ‘స్క్రిప్ట్ చదివిన క్షణంలోనే ఈ చిత్రం త‌న‌ కోసమేన‌ని భావించానని, ప్రేమ‌, జీవితం, చీకటి, నన్ను మలుచుకునే విధానం అన్నీ ది ఐ మూవీలో ఉన్నాయని తెలిపింది..

ఈ కథ వింటుంటే సేమ్ టూ సేమ్ తన కథలాగే అనిపించింది అని శృతి ఆశ్చర్య పోయింది..’ది ఐ’ మూవీలో నటనకి ఎక్కువ ఆస్కారముందని, మహిళా క్రియేటివ్ టీమ్‌తో పనిచేయడం ఈ ప్రాజెక్టు స్పెషల్ అని తెలిపింది శృతి. డయానా పాత్ర తన మనసుకు, తన జీవితానికి చాలా దగ్గరగా ఉందని, ఆ పాత్రలో ఉండే భావోద్వేగాలు స్క్రీన్ పై మరింత అందంగా మ‌లిచారని, క‌థ‌లో చాలా ట్విస్టులు ఉంటాయని, తన మొదటి హాలీవుడ్ సినిమాపై చాలా హైపు పెంచింది శృతి..!!

RC16: Janhvi Kapoor’s birthday poster released!

rukmini vasanth is the perfect replacement for sai pallavi!