జాన్వీకపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. శ్రీదేవి, బోనీకపూర్ ముద్దుల కూతురిగా దఢఖ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన జాన్వీ..ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. గత ఏడాది దేవర సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా ఆర్సీ16లో నటిస్తున్నారు. అయితే ఇవాళ జాన్వీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇవాళ జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు వెరైటీగా బర్త్ డే విషెస్ తెలిపింది. మూవీలోని ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో జాన్వీ కపూర్ ఒక చేత్తో మేకపిల్లను ఎత్తుకోగా..మరోచేత్తో గడ్డి మొక్కను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కేక అంటూ బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..!!