2024 లో మీనాక్షి చౌదరి ఏకంగా ఆరు సినిమాల్లో నటించింది. అందులో తెలుగు సినిమాలు నాలుగు ఉన్నాయి. 2024 లో గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ సినిమాల్లో నటించిన మీనాక్షి తమిళ్ లో తెరకెక్కిన గ్రేటెస్ట్ ఆల్ ది టైం, సింగపూర్ సెలూన్ సినిమాల్లో నటించింది. ”సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అమ్మడు. ఇవే కాకుండా నవీన్ పొలిశెట్టితో ”అనగనగా ఒకరాజు”, చిరంజీవి విశ్వంభర సినిమాల్లో కూడా నటిస్తుంది మీనాక్షి. అందం అభినయం రెండు ఉన్న మీనాక్షి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తుంది.
హర్యానాలో పుట్టి పెరిగిన మీనాక్షి ప్రొఫెషనల్ గా డెంటల్ సర్జరీ కోర్స్ పూర్తి చేసింది. 2018లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచిన ఈ అమ్మడు ఆ టైం లోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది..అందంతో పాటు టాలెంట్ కూడా ఉన్న ఈ అమ్మడు కచ్చితంగా టాలీవుడ్ లో స్టార్ రేంజ్ కి వెళ్తుందని చెప్పొచ్చు. సక్సెస్ ఫుల్ కెరీర్ తో దూసుకెళ్తున్న మీనాక్షి చౌదరి పుట్టినరోజు నేడు ఆమె ఇలాంటి బర్త్ డేలు మరెన్నో జరుపుకోవాలని కోరుతుంద..!!