AP బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా మరికొంతమంది విమర్శలు కూడా చేశారు. నిజానికి మీనాక్షి చౌదరి హర్యానాకు చెందిన అమ్మాయి ఇలా ఆంధ్ర పదేశ్ కు చెందిన వ్యక్తిని కాకుండా పక్క రాష్ట్రానికి చెందిన వారికి ఇలాంటి పదవి ఇవ్వటం ఏంటి అంటూ చాలా మంది విమర్శలు కురిపించారు. ఈమె కంటే కూడా ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన మహిళలు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నారు. అలాంటి వారిని మహిళా సాధికారిక విభాగానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించవచ్చు కదా అంటూ విమర్శలు కురిపించారు..
ఇలా మీనాక్షి చౌదరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ విషయంపై స్పందించారు. మీనాక్షి చౌదరిని ఏపీ ప్రభుత్వ మహిళా సాధికారత విభాగానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఖండించారు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వెల్లడించారు. ఇక ఈ వార్తలన్నీ ఫేక్ అని తెలియడంతో ఒక ఫేక్ న్యూస్ తో మీనాక్షి చౌదరికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు..!!