గత మూడు సంవత్సరాలుగా పూజా ఒక్క తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు. దాంతో ఆమెకు టాలీవుడ్ నుంచి గ్యాప్ వచ్చినట్టేనా? అనే చర్చ నడుస్తోంది. ఇంతకీ పూజా టాలీవుడ్‌కి ఎందుకు దూరమైందన్న దానిపై చర్చ నడుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ పూజపై పరోక్షంగా నిషేధం విధించిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. పూజా అధిక పారితోషికం, సెట్లో లగ్జరీ డిమాండ్స్ వల్లే టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడం మానేశారని వార్తలు వస్తున్నాయి..
గతంలో కొందరు నిర్మాతలు హీరోయిన్లు అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే కాక, సెట్‌లో ప్రత్యేక వసతులు కోరడం వల్ల షూటింగ్ ఖర్చులు పెరిగిపోతున్నాయని వాపోయారు. వీరిలో పూజా పేరు కూడా ప్రధానంగా వినిపించింది. టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకున్న పూజా ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో సూర్యతో ‘రెట్రో’, రాఘవ లారెన్స్‌తో ‘కాంచన 4’, విజయ్‌తో ‘జన నాయగన్’, రజనీకాంత్‌తో ‘కూలీ’ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో కూడా ఆమె ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది..!!