దక్షిణాది సినీ పరిశ్రమపై ప్రముఖ సినీ నటి జ్యోతిక కీలక వ్యాఖ్యలు చేశారు. సౌత్ లో చాలా మంది డైరెక్టర్లు హీరోల కోసమే కథలు రాసుకుంటారని ఆమె అన్నారు. వయసు పెరిగినా, వారిని జనాలు హీరోలుగా ఒప్పుకుంటారని.. హీరోయిన్ల వయసు పెరిగితే అస్సలు ఒప్పుకోరని చెప్పారు. తాను నటించిన వెబ్ సిరీస్ ‘దబ్బా కార్టెల్’ నిన్న నెట్ ఫ్లిక్స్ లో విడుదలయింది. ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు..
తనకు 28 ఏళ్ల వయసులో పిల్లలు పుట్టారని..ఆ తర్వాత విభిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నానని జ్యోతిక తెలిపారు. అప్పటి నుంచి స్టార్ హీరోలతో కలిసి నటించలేదని చెప్పారు. సౌత్ లోని ఇతర ఇండస్ట్రీల గురించి తాను చెప్పలేను కానీ..తమిళ్ ఇండస్ట్రీలో మాత్రం హీరోయిన్ కు వయసును అడ్డుగా చూస్తారని అన్నారు. అలాంటప్పుడు మనమే కొత్త డైరెక్టర్లతో పని చేస్తూ కెరీర్ ను నిర్మించుకోవాలని చెప్పారు..!!