in

Shruti Haasan making her Hollywood Debut!

శృతి మల్టీ టాలెంటెడ్  నటిగానే కాకుండా సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు హాలీవుడ్ లోకి కూడా శృతి హాసన్ ఎంటర్ అయ్యింది. ఒక సౌత్ ఇండియన్ హీరోయిన్ హాలీవుడ్ లో ఛాన్స్ దక్కించుకోవటం గ్రేట్ అచీవ్ మెంట్ గా చెప్పొచ్చు. హాలీవుడ్ లో మార్క్ రౌలీకి జోడీగా ‘ది ఐ’ అనే మూవీ చేస్తోంది. ఫింగర్ ప్రింట్ కంటెంట్ బ్యానర్ పై డ్యాఫెన్ స్కమన్ దర్శకత్వంలో ‘ది ఐ’ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ ఫిబ్రవరి 27 న ముంబై వెంచ్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు.

దీని తరవాత థియేటర్ డేట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ లో చావు జీవితానికి ఎండ్ కాదు అనే కొటేషన్ తో ‘ది ఐ’ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ట్రైలర్ ఉత్కంఠ భరితంగా ఉంది. ఇదొక థ్రిల్లర్ జోనర్ అని తెలుస్తోంది. శృతి హాసన్ యాక్టింగ్, ఎక్సప్రెషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా శృతి అలవోకగా నటించింది. ఈ మూవీ తరువాత శృతి హాసన్ హాలీవుడ్ లో మరిన్ని ఛాన్స్ లు అందుకుంటోంది ఏమో చూడాలి..!!

SS Rajamouli’s friend accused of ‘torture’ in suicide note!

malavika mohanan: extremely happy to collaborate with Prabhas