in

SS Rajamouli’s friend accused of ‘torture’ in suicide note!

తాజాగా రాజమౌళి ఫ్రెండ్ యు.శ్రీనివాసరావు అనే అతను రాజమౌళిపై చాలా ఆరోపణలు చేస్తూ, వీడియో రిలీజ్ చేసారు. రాజమౌళితో తనకి 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని, ఇప్పటివరకు రాజమౌళి పెట్టిన టార్చర్ భరించానని, ఇక నావల్ల కాదు ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చారు. విడియోతోపాటు ఒక లెటర్ కూడా రాసి, తన సెల్ఫీ వీడియో, లెటర్‌ ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు ఫైల్ చేయాలని పోలీసుల్ని కోరారు శ్రీనివాసరావు. ఇతను పలు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేసారు..

శ్రీనివాస  సెల్ఫీ వీడియోలో ‘నాది, రాజమౌళిది 34 ఏళ్ళ స్నేహం. టీనేజ్ లో మా ఇద్దరి లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది, ఆర్య 2 లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. రాజమౌళి మాట పై నేను త్యాగం చేశాను. శాంతి నివాసం సీరియల్ ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇదని తెలిపారు. రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయ్యాక నేను ఇవన్నీ వాళ్ళతో వీళ్ళతో చెప్పేసానని భ్రమతో నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. 30 ఏళ్ళ జీవితం వాడి కోసం త్యాగం చేశాను. ఓ సారి మా  స్టోరీని సినిమా తీస్తానని అనడంతో నన్ను టార్చర్ చేస్తున్నాడు. రాజమౌళి ఫ్యామిలీ అంతా నాకు దూరం అయ్యారు అని వాపోయాడు. ఇది నా మరణ వాంగ్మూలం’ అని కూడా హెచ్చరించాడు శ్రీనివాస్..!!

Rakul Preet Singh Misses Jackky Bhagnani on Movie Sets!

Shruti Haasan making her Hollywood Debut!