డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి రాబోతున్నారని వార్తలు రావటమే కాకుండా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై మంచి అంచనాలను పెంచింది అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఆలస్యం అవుతూ వస్తుంది ఈ క్రమంలోనే ఈ సినిమా ఆగిపోయింది అంటూ కూడా వార్తలు వినిపించాయి.
ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ స్పందిస్తూ ఈ సినిమా ఆగి పోలేదని త్వరలోనే సరికొత్త అప్డేట్ తెలియజేస్తామని వెల్లడించారు. తాజాగా వీరి సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వినపడుతుంది మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ హ్యాండ్ ఇచ్చారని తెలుస్తోంది ప్రస్తుతం ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి ప్రభాస్ తో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.!!