తాజాగా శోభిత తీసుకున్న నిర్ణయం ఫాన్స్ కి షాకిచ్చింది. కానీ అక్కినేని ఫాన్స్ కి మాత్రం ఇది మంచి శుభవార్త అని చెప్పొచ్చు. శోభిత కెరియర్ మొదటి నుంచి హాట్ & బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది. హద్దులు మీరు గ్లామర్ షో చేసింది. శోభిత పేరు చెప్పగానే ఈ హాట్ అండ్ బోల్డ్ ఇమేజ్ గుర్తుకు వస్తుంది. మేడిన్ హెవెన్, నైట్ మ్యానేజర్, అన్నిటిలో ఇంటిమేట్ సీన్స్ లో బోల్డ్ గా నటించింది. పేరున్న వారెవరు చేయని కండోమ్ లాంటి బోల్డ్ కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించింది..
కానీ ఇక నుంచి ఇలాంటి పాత్రలు చేయకూడదని డిసైడ్ అయ్యిందట..పెళ్లి తరువాత కూడా నటనని కొనసాగిస్తా అని చెప్పిన శోభిత ఇప్పుడు కూడా అదే నిర్ణయం మీద ఉంది. కానీ గ్లామర్ పాత్రలకి దూరం అని చెప్తోంది. అక్కినేని ఇంటి కోడలు అయ్యాక కూడా ఇలా హాట్ గా కనిపించటం కరక్ట్ కాదని, నటనకి ఆస్కారమున్న పాత్రల్లో నటించాలని నిర్ణయించుకుంది అని టాక్. పెళ్లి తర్వాత శోభితలో చాలా మార్పు వచ్చింది. బయట కూడా ఎప్పుడు సంప్రదాయంగా చీర కట్టులోనే కనిపిస్తోంది. తండేల్ సక్సెస్ మీట్ లో కూడా శారీ లోనే మెరిసింది..!!