విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. VD12గా వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమా టైటిల్ ఇంకా టీజర్ ని ఈ నెల 12న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు..
విజయ్ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే టీజర్ కి తారక్ వాయిస్ ఓవర్ పూర్తి చేశారట ఐతే ఈ సినిమాను హిందీలో కూడా భారీ రిలీజ్ చేస్తున్నారు. అందుకే అక్కడ కూడా వాయిస్ ఓవర్ కోసం స్టార్ హీరోని దించుతున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ యానిమల్ హీరో రణ్ బీర్ కపూర్ విజయ్ దేవరకొండ సినిమాకు వాయిస్ ఓవర్స్ ఇస్తున్నారట. రీసెంట్ గా ముంబై డబ్బింగ్ స్టూడియోలో రణ్ బీర్ డబ్బింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది..!!