in

can other heroes catch Prabhas speed in making movies?

స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేస్తుంటే మరికొందరు హీరోలు ఒక్క సినిమాకు రెండేళ్లు టైమ్ తీసుకుంటున్నారు. దీంతో వారి సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటున్నారు. అయితే తాము ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి రెడీ అంటూ హీరోలు చాలామంది స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఇది వాళ్లు చెప్పినంత ఈజీనా? నిజంగానే మన స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు చేయగలరా? ప్రభాస్ ఒక్కడికే సాధ్యమవుతున్న ఈ ఫిట్‌ను మిగిలిన వాళ్లు చేసి చూపిస్తారా?.

ప్రస్తుతం స్టార్ హీరోలలో ప్రభాస్ ఒక్కరే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది రాజా సాబ్ విడుదల కానుంది. అలాగే హను రాఘవపూడి ఫౌజీ కూడా తక్కువ గ్యాప్‌లోనే రానుంది. అంటే ఇవి రెండు సినిమాలు ఈ ఏడాది వస్తాయి. అలాగే సలార్, కల్కి2, స్పిరిట్ లాంటి సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇవన్నీ రాబోయే రెండేళ్లలోనే విడుదల కానున్నాయి. అంటే ఇప్పుడు ప్రభాస్ చేతిలో మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి. ఇక మిగతా హీరోలు ప్రభాస్ లాగే తాము వేగంగా సినిమాలు చేయాలని భావిస్తున్నారు..!!

 

Chiranjeevi confirms a Full-Fledged Entertainer with Anil Ravipudi

sai pallavi: playing sita role in ramayana is my dream