మహేష్ బాబు సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ
SSMB29 గురించి రాజమౌళి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. కానీ సినిమాలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనే చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ మూవీలో ప్రియాంక హీరోయిన్ అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఇటీవల ప్రియాంక హైదరాబాద్‌కు రావడంతో ఆమె సినిమా షూటింగ్ కోసం వచ్చారన్న వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. అంతేకాదు ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుగుతుందన్నట్టు తెలుస్తోంది..
మహేష్ బాబు కు విలన్ రోల్ చేస్తున్న ప్రియాంక చోప్రా
కానీ ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ రాజమౌళి మాత్రం సినిమాకు సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా బయటకు రానివ్వడం లేదు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు వినిపించింది. అలాంటిదేమీ లేదని పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాను తీసుకున్నారనే వార్త గట్టిగా వినిపించింది. అయితే అందరూ అనుకున్నట్టు ప్రియాంక హీరోయిన్ కాదట. ఈ సినిమాలో లేడీ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. అందుకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారని తెలుస్తోంది..!!