in

Krishna Vamsi Apologizes now For showing actress Bold!

నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించి  తెరకెక్కించిన చిత్రం శ్రీ ఆంజనేయం. 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.  కానీ ఇప్పుడు టీవీలో వస్తే మాత్రం సినిమాను వదలకుండా చూస్తారు ప్రేక్షకులు. అయితే ఇలాంటి భక్తి సినిమాలో హీరోయిన్ ఛార్మిని హాట్ గా చూపించడం మాత్రం అప్పుడు,ఇప్పటికీ ప్రేక్షకులకు నచ్చదు. అయితే తాజాగా ఇదే విషయంపై డైరెక్టర్ కృష్ణవంశీ ట్విట్టర్ లో ప్రశ్నించాడు ఓ నెటిజన్.

శ్రీ ఆంజనేయం లాంటి భక్తి సినిమాలో హీరోయిన్ ఛార్మీని ఎందుకు అలా చూపించారు? అని ప్రశ్నించగా  కృష్ణవంశీ స్పందిస్తూ అవును..తప్పేనండీ..క్షమించండి..తీరని సమయాలు తీరని చర్యలు తీరని పనులు అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ ఛార్మి గ్లామర్ డోస్ శృతిమించిందని,ఆమె క్యారెక్టర్ తీరు సినిమాను తప్పుదోవ పట్టించిందని అప్పట్లో కృష్ణవంశీని బాగానే ట్రోల్ చేశారు. తాజాగా ఇలా చేయడం తన తప్పేనని కృష్ణవంశీ ఒప్పుకోవడం విశేషం..!!

kobali web series!