సినిమా పూర్తిగా అడ్వెంచర్ జానర్లో రూపొందుతుందని, ఇటీవలి కాలంలో ఇండియన్ సినిమాల్లో ఇలాంటి కథ రాలేదని తెలిపారు. మహేష్ కెరీర్లో తొలిసారిగా ఈ జానర్లో నటిస్తున్నారని స్పష్టత ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్, కథను సిద్ధం చేసేటప్పుడు ఇదే దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా కసరత్తు చేశామని అన్నారు. మోడ్రన్ స్టోరీలైన్‌తో పాటు, ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని కలిగించేలా సినిమా ఉండబోతుందన్నారు. సినిమా కథా బలం, మహేష్ క్రేజ్‌ను డామినేట్ చేయదని, కథే ప్రధానమైనదని చెప్పారు..
ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. ప్రధానంగా కెన్యాలో షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్‌కు రాజమౌళి ప్రత్యేకంగా రీసెర్చ్ చేసిన తర్వాతే షూటింగ్ ప్రారంభించారని తెలుస్తోంది. 1000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రం, పాన్ వరల్డ్ లెవెల్లో ప్రేక్షకులను మెప్పించేలా ఉండబోతుంది. ఇక సినిమా నుంచి ఎలాంటి లీకులు బయటకు రాకుండా జక్కన్న పకడ్బందీ ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. మహేష్ బాబుకు ఇది మరో బిగ్ మూవీగా నిలిచే సినిమా అవుతుందనే అంచనాలు నెలకొన్నాయి..!!