ఇంకో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. జవాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసాడు. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారని సమాచారం. ఇప్పడు ఇదే మూవీకి రష్మిక ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది..
రష్మిక ఇప్పటికే సల్మాన్ తో సికిందర్ మూవీలో చేస్తోంది. నెక్స్ట్ మూవీలోనూ సల్మాన్ కి జోడీ రష్మిక కావటం విశేషం. యానిమల్ ముందు రష్మిక హిందీలో ఒ రెండు మూడు సినిమాలు చేసినా అంత గుర్తింపు రాలేదు. కానీ యానిమల్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. బాలీవుడ్ లో కపూర్లని డామినేట్ చేసి రష్మిక మార్క్స్ కొట్టేసింది. దీంతో బాలీవుడ్ బ్యూటీస్ ని తలదన్నే అవకాశాలు వచ్చాయి నేషనల్ క్రష్ కి. అట్లీ మూవీతో పాటు సందీప్ వంగా స్పిరిట్ లో కూడా రష్మిక పేరు వినిపిస్తోంది..!!