ఇటీవల జిమ్ లో వర్కౌట్లు చేస్తూ రష్మిక గాయపడ్డారు. కాలికి గాయం కావడంతో వైద్యులు పట్టీ వేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ రష్మిక ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘గాయం నుంచి పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ భగవంతుడికే తెలియాలి. త్వరగా కోలుకుని ‘సికందర్’, ‘థామ’, ‘కుబేర’ సెట్స్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నా. నా వల్ల జరిగిన ఆలస్యానికి క్షమించాలంటూ ఆయా చిత్రాల దర్శకులను కోరుతున్నా. నా కాలు సెట్ అయినా వెంటనే షూటింగ్ కు హాజరవుతా’’ అని తెలిపారు.
ఈ క్రమంలోనే ముంబై వెళ్లేందుకు రష్మిక బుధవారం ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కారు దిగి తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో వీల్ చెయిర్ లో కూర్చున్నారు. కాలుకు పట్టీ ఉండడంతో నడవలేకపోతున్న రష్మికను ఆమె సిబ్బంది వీల్ చెయిర్ లో విమానం వద్దకు తీసుకెళ్లారు. కాగా, హిందీ సినిమా ప్రచారంలో పాల్గొనేందుకు రష్మిక ముంబై బయలుదేరినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు..!!